Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' నుంచి మరో లీక్... రామరాజు, సీత ఇలా..!

Another Leak from RRR
  • శరవేగంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'
  • తాజాగా లీక్ అయిన మరో పిక్
  • ఫ్యాన్ మేడ్ అని కొందరంటున్నా వైరల్
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం గురించిన సమస్త సమాచారాన్ని ఎంత రహస్యంగా ఉంచినా, ఏదో ఒక రూపంలో లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి రామరాజుగా నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ నటిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్, సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ ఇలాగే కనిపించనున్నారంటూ, ఓ రెండు చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎన్నడో తీసిన పాతకాలం నాటి చిత్రాలుగా ఇవి కనిపిస్తున్నాయి. వీటిని సినిమా కథానుసారం, ఫైల్ ఫొటోలుగా వినియోగించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలో రామ్ చరణ్, బ్రిటీష్ సైనిక అధికారిగా కనిపిస్తున్నాడు. ఇక అల్లూరి సీతారామరాజు తన జీవితంలో బ్రిటీష్ అధికారిగా పని చేయలేదు. ఇక ఈ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటి? అది ఎలా వచ్చిందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగక తప్పదు.

కాగా, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా 'ఆర్ఆర్ఆర్' గురించి బయటకు వచ్చే ఏ సమాచారం అయినా, అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది కాబట్టి, ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
RRR Leak
Pic
Ramcharan
Alia Bhat
Viral

More Telugu News